రేషన్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం

133

ఏపీలో ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణి కోసం వాహనాలను ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జెండా ఊపిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభం అయ్యాయి.