కాసేపట్లో సీఎం జగన్ ఢిల్లీకి పయనం

70

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.. అనంతరం అక్కడినుంచి నేరుగా ఢిల్లీకి వెళతారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, బాలసౌరి అలాగే ఉన్నతాధికారులు కూడా వెళతారు.

కాగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం అవుతారని సీఎంఓ వార్గాలు తెలిపాయి.. అమిత్ షా తో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్టుకు పునరావాసం ప్యాకేజి కింద రావాల్సిన నిధులు వంటి అంశాలపై చర్చించనున్నారు.