నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

142

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మేనల్లుడు జగదీష్, హోంమంత్రి మేకతోటి సుచరిత బంధువు కుమార్తె‌ వివాహవేడుక గురువారం జరిగింది.. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి‌ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులు జగదీష్, జాక్లిన్‌ రోజ్‌ దంపతులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. అనంతరం నూతన దంపతులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.