కేటీఆర్ బర్త్ డే గిఫ్టుగా సీఎం సీటు.. నిజమేనా?

225

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ కేటీఆర్ కాబోయే సీఎం.. కాదు కాదు ఆల్మోస్ట్ సీఎం ఆయనే.. నేడోరేపో ముహూర్తం.. పట్టాభిషేకానికి కేటీఆర్ తండ్రి, సీఎం కేసీఆర్ దివ్యమైన ముహూర్తం కూడా పెట్టేశారని రకరకాల కథనాలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు, అధికార పార్టీలోని కీలక నేతలే కేటీఆర్ సీఎం అనే వ్యాఖ్యలు చేయడం.. మరికొందరు మరో అడుగు ముందుకేసి శుభాకాంక్షలు కూడా చెప్పడం.. కేటీఆర్ ఎలాంటి ఖండన లేకపోవడం.. కల్వకుంట్ల కుటుంబం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో దాదాపుగా కేటీఆర్ పట్టాభిషేకానికి ఫిక్స్ అయిపోయారు.

కానీ.. ఏ రోజుకారోజు చర్చలు పెట్టి హైప్ క్రియేట్ అయితే చేశారు కానీ అనుకున్న ముహూర్తం మాత్రం బయటపడడం లేదు. ఇక ఇప్పుడు ఈ పట్టాభిషేకానికి కేటీఆర్ పుట్టినరోజే ముహూర్తం పెడతారని సోషల్ మీడియాలో కొన్ని పొలిటికల్ గ్రూపులు సర్కిలెట్ చేస్తున్నాయి. మరి ఇదైనా నిజమవుతుందా అని గులాబీ పార్టీ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ముహూర్తం కూడా కష్టమేనని చెప్తున్నారు.

ఎందుకంటే రాష్ట్రంలో పలు రాజకీయ సమస్యలు ఉండనే ఉన్నాయి. హైదరాబాద్ నగర మేయర్ నియామకం ఇంకా పూర్తి కానేలేదు. నాగార్జున సాగర్ బై పోల్ పరీక్ష ఒకటి ముంచుకొస్తుంది. కాళేశ్వరం, యాదగిరి దైవక్షేత్రం రీమోడల్ పనులు, వాటి ప్రారంభం ఇంకా పూర్తికానే లేదు. ఇవన్నీ ఉండగా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం మార్పు అనే సాహసం సీఎం కేసీఆర్ చేసే అవకాశం దాదాపుగా ఉండదని వారి వాదన. మరి అయితే సాక్షాత్తు సొంత పార్టీ నేతలే ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నట్లు అంటే కేసీఆర్ నడిపే ప్రతి ప్రణాళిక వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని.. అది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని వినిపిస్తున్నాయి.

కేటీఆర్ బర్త్ డే గిఫ్టుగా సీఎం సీటు.. నిజమేనా?