రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించిన సీఎం నారాయణస్వామి :- వీడియో వైరల్

279

రాహుల్ గాంధీ ఈ మధ్య తమిళనాడులో ఎక్కువగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు, విందుల్లో పాల్గొంటున్నారు. ఇక తమిళనాడు పక్కనే ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నారాయణస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐతే ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ గాంధీ వెళ్లారు. ప్రజలతో సమావేశమయ్యారు.

పుదుచ్చేరిలో అధికంగా తమిళం మాట్లాడే వారు ఉంటారు. రాహుల్ కు తమిళం రాకపోవడంతో ట్రాన్స్లేటర్ గా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిని పెట్టుకున్నారు. ఇక ఈ సమయంలోనే సభకు వచ్చిన ఓ వృద్ధురాలు మైకు తీసుకోని తమ సమస్యను రాహుల్ గాంధీకి వివరించింది. నివర్ తుఫానుతో తాము ఇబ్బంది పడినప్పుడు ఒక్కరు కూడా తమను ఆదుకునేందుకు రాలేదని, తాము కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చారని ప్రశ్నించారు.

అయితే ఈ మాటలు ట్రాన్స్లేషన్ చేసే సమయంలో సీఎం నారాయణస్వామి సొంత కవిత్వం అల్లారు. తుఫాను సమయంలో తాను వారిని ఆదుకున్నానని ఆ వృద్ధురాలు చెబుతుంది.. అంటూ తప్పుడు ట్రాన్స్లేషన్ చేశారు సీఎం.. ప్రస్తుతం సీఎం ట్రాన్స్లేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు సీఎంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

 

రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించిన సీఎం నారాయణస్వామి