పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన

48

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోనసాగుతోంది. ఇవాళ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.రూ.3,115 కోట్లతో గండికోట – సిబిఆర్, అలాగే గండికోట – పైడిపాలెం లిఫ్ట్ స్కీమ్ కు సీఎం శంకుస్థాపన చేశారు. పులివెందులలో నూతన ఆర్టీసీ బస్టాండ్ తోపాటు డిపోకు కూడా శంకుస్థాపన చేశారు. రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ కు శంకుస్థాపన చేశారు. అలాగే 14.5 కోట్లతో ఆంజనేయ స్వామి క్షేత్రం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు భూమి సమీకరించడానికి రూ.125 కోట్లకు కేటాయించారు. ఫిబ్రవరికల్లా వైద్య కళాశాల పనులను ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.