CM KCR: ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఖబర్ధార్!

143

CM KCR: కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరో నామినేట్‌ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు మాది. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మేం తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. బీజేపీ నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హాలియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. నాది అవినీతి రహిత ప్రభుత్వం. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్‌ఎస్‌. కేసీఆర్‌ వట్టి మాటలు చెప్పడు. తెలంగాణను బంగారు తునక చేయాలని కష్టపడుతున్నాం. ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఓట్లు ఆడగం అని చెప్పాలంటే ఎంత ధైర్యముండాలి? ఇంతకుముందు ఏ నాయకుడైనా ఇలా చెప్పారా? రాజకీయ గుంటనక్కలను చూసి మోసపోవద్దు’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గత దుస్థితికి ఎవరు కారణం? గతంలో రైతుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? అని ప్రశ్నించిన కేసీఆర్ తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా వారికి లేదని మండిపడ్డారు. పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టారని, ఇప్పుడు పొలం బాట, పోరు బాట అని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

యాదాద్రి దివ్యక్షేత్రాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ప్రపంచమే అబ్బురపోయేలా ఆలయాన్ని నిర్మిస్తున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్‌ భగీరథతో 100శాతం ఫ్లొరైడ్‌ భూతాన్ని తరిమిసేంది. తాగు, సాగునీటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉంటే..నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించండి. లేదంటే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయండి. నా మాటలు నిజమని నమ్మితే..వేరే పార్టీలకు డిపాజిట్లు రాకుండా గులాబీ జెండా ఎగరేయాలి. కాంగ్రెసోళ్లకు వింత వింత బీమారీలు ఉన్నాయి. గాలి మాటలకు మోసపోవద్దు. మంచి ప్రభుత్వాన్ని కాపాడుకుంటే బాగుపడతామని సీఎం పేర్కొన్నారు.

CM KCR: ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఖబర్ధార్!