మాకు ఆ భూమి ఇవ్వండి.. మీకు 25 ఎకరాలు ఇస్తాం :- సీఎం జగన్

272

విజయవాడలో రైల్వేకు సంబందించిన భూమిని ఆక్రమించి కొందరు వ్యక్తులు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే వారికి ఆ భూమిని కేటాయించాలంటూ రైల్వే శాఖామంత్రి పీయూష్ గోయల్ కు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. 30 ఏళ్లుగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేరని అందుకే వారికి ఆ భూములు కేటాయించాలని కోరారు. ఆ భూములకు బదులుగా అజీజ్ పేటలోని 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ లేఖపై పీయూష్ గోయల్ స్పందించాల్సి ఉంది. ఈ లేఖపై ఆక్రమణ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాకు ఆ భూమి ఇవ్వండి.. మీకు 25 ఎకరాలు ఇస్తాం :- సీఎం జగన్