రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షా తో సీఎం జగన్ భేటీ

68

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.