అంతర్వేది రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

336

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం నూతన రథాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి రథాన్ని లాగారు.. 2020 సెప్టెంబర్ లో గుర్తు తెలియని వ్యక్తులు రథాన్ని దగ్ధం చేశారు. ఈ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని విచారణను సీబీఐకి అప్పగించింది.

అయితే ఇప్పటి వరకు రథం కాల్చిన వారిని గుర్తించేలేకపోయారు. మొదట రాష్ట్ర పోలీస్ శాఖ ఓ బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. విచారణలో జాప్యం జరుగుతుందని విమర్శలు రావడం, ప్రభుత్వమే చేపించిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో సీఎం జగన్ సీబీఐతో విచారణ చేయించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సీబీఐకి కేసును అప్పగించారు. ఇక ఈనెల 28 వరకు స్వామి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా కార్యక్రమం అనంతరం సీఎం జగన్ హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరారు.

అంతర్వేది రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్