కడప గడపకు జగన్..

84

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప పర్యటన ఖరారైంది. డిసెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. 24న జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 23 సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప బయల్దేరతారు జగన్. అక్కడినుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు వెళ్లారు, రాత్రికి అక్కడే బస చేస్తారు.

24న ఉదయం 9.10 గంటలకు వైయస్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. ఇదేరోజు ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు, ఇమ్రా ఏపీ, ఆ తర్వాత అపాచీ లెదర్ డెవలప్ మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు.

డిసెంబర్ 25 న క్రిస్మస్ సందర్బంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్తారు. అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా కాకినాడ చేరుకొని ఇళ్లపట్టాల పంపిణి చేపడతారు.

కాగా ఇళ్లపట్టాల పంపిణి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో సీఎం జగన్ చేతుల మీదగా డిసెంబర్ 25 న ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ కడప పర్యటనకు వెళ్తుండటం, సమయం లేకపోవడంతో 28 న ఊరందూరు గ్రామంలో పంపిణి చెయ్యనున్నారు.

కడప గడపకు జగన్..