6 రకాల భూములపై సీఎం జగన్ కన్నేశారు : చంద్రబాబు

55

ఏపీలో భూముల సమగ్ర రీసర్వేలో భాగంగా ఆరు రకాల భూములను లాక్కోవడంపై మంత్రులు,
అధికారపార్టీ ఎమ్మెల్యేలు దృష్టి సారించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చుక్కల భూములు, అసైన్మెంట్ భూములు, సొసైటీ భూములు , లిటికేషన్ కు అవకాశం ఉన్న భూములపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ​​కన్నేశారని.. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతిరోజూ తమ భూ స్థితిని తనిఖీ చేసుకోవాలని చెప్పారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జిలు, నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ఈ ఆరోపణలు చేశారు.

శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో వందల కోట్లరూపాయల విలువైన భూ కుంభకోణాలు వెలువడుతున్నాయని.. ఉచిత గృహ స్థలాల కోసం భూసేకరణ పేరిట, అధికార పార్టీ నాయకులు రూ .4,000 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అలాగే ఇచ్చే భూములలో కూడా రూ .2,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. అక్రమాలపై వైయస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక దారుణాలు, తప్పుడు కేసులు పెడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.