‘సుప్రీం’ చీఫ్ జస్టిస్ తల్లికి 2.5 కోట్లకు టోపీ పెట్టిన కేర్‌టేకర్‌

87
CJI SA Bobde's mother duped of Rs 2.5 crore, accused held
CJI SA Bobde's mother duped of Rs 2.5 crore, accused held

ఆస్తులకు కేర్ టేకర్ గా ఉంటూ.. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే తల్లినే మోసం చేశాడో వ్యక్తి. బాబ్డే తల్లి ముక్తా అరవింద్ బోబ్డే అస్తులకు పర్యవేక్షకుడుగా ఉంటున్న వ్యక్తి ఏకంగా 2.5 కోట్ల మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. దీంతో తపస్ ఘోష్(49) అనే వ్యక్తిని డిసెంబర్ 8న రాత్రి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డిసిపి వినీతా సాహు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ విషయాన్ని పరిశీలిస్తోందని నాగ్‌పూర్ పోలీసు కమిషనర్ (సిపి) అమితేష్ తెలిపారు కుమార్.

సిజెఐ బొబ్డే తల్లి ముక్తా బొబ్డేకు ఆకాశ్వానీ స్క్వేర్ సమీపంలో ఓ ఫంక్షన్ హాల్ ఉంది, దీనిని వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం అద్దెకు ఇస్తుంటారు. 2007 లో ఈ ఫంక్షన్ హాలుకు
మేనేజర్ గా తపస్ ఘోష్ ను నియమించారు. అయితే గతకొంతకాలంగా ముక్తా అనారోగ్యం భారిన పడ్డారు. దాంతో ఆమె అనారోగ్యాన్ని అవకాశంగా మలుచుకున్న తపస్ ఘోష్ తప్పుడు లెక్కలు చూపిస్తూ ఏళ్ల తరబడి నిధుల గోల్‌మాల్ కు పాల్పడుతున్నారు. అయితే లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా నాలుగు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు.