పురుగులమందు తాగి సీఐ ఆత్మహత్యయత్నం

246

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహింస్తున్న సాయిరమణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వరంగల్ జిల్లా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం తన కారులోనే సీఐ పురుగులమందు తాగాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది కారును గమనించి , దగ్గరికి వెళ్లి పరిశీలించారు. ఇంతలోనే సీఐ సాయి రమణకు ఫోన్ వచ్చింది.. ఆ ఫోన్ ఎట్టిమాట్లాడారు బ్లూకోల్ట్ సిబ్బంది.

అయితే అపస్మారక స్థితిలో పడిఉన్న వ్యక్తి చిట్యాల సీఐ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ పక్కనే సూసైడ్ నోట్ లభించింది. కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జి ఎస్‌పి సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ సీఐ సాయిరమణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

పురుగులమందు తాగి సీఐ ఆత్మహత్యయత్నం