ఘనంగా క్రిస్మస్ వేడుకలు

57

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ విద్యుత్ దీప కాంతులతో కళకళలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి చర్చిలలో ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్‌ బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పర్వదినం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు. ఇక కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా సుబేదారిపేటలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మందిరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కేకు కోసి భక్తులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు