98 కేజీలు తగ్గిన కొరియోగ్రాఫర్‌‌.. ఎంత సమయంలో అంటే..

129

బాలీవుడ్ సూపర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.. ఆ మధ్య ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ చిత్రంలో గణేష్‌ ఓ పాత్రలో నటించారు. ఆ సినిమాలో భారీ కాయంతో కనిపించిన గణేష్ ఏడాదిన్న కాలంలో 98 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్నీ గణేశే స్వయంగా వెల్లడించారు. ఇటీవల ప్రముఖ కపిల్‌ శర్మ కామెడీ షోకు అథితిగా వచ్చిన ఆయన ఏబీసీడీ సినిమా రిలీజ్ సమయంలో తాను దాదాపు 200 కిలోల బరువు ఉన్నానని అయితే ఇప్పుడు దాదాపు వంద కిలోలు తగ్గానని వెల్లడించారు. దీంతో తన శరీరం చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అయితే ఇంత పెద్దమొత్తంలో బరువు తగ్గడం కూడా ఈజీగా జరగలేదని, ఇందుకోసం ఏడాదిన్నర సమయం తీసుకున్నానని చెప్పారు.

ఈ ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్కరోజు కూడా జిమ్‌ మిస్ అవ్వలేదని.. కసిగా కఠినమైన కసరత్తులు చేసి ఈ స్థితికి వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా 2015లో తను నటించిన ‘హే బ్రో’ సినిమా సమయంలో కూడా దాదాపు 40 కిలోల బరువు తగ్గానని చెప్పారు. అయితే అప్పుడు రాని సంతోషం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. కాగా బాలీవుడ్‌లో గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, గోవింద లకు ఆయన కొరియోగ్రఫిని అందించారు. 2018లో వచ్చిన ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు కొరియోగ్రాఫర్‌ గా చేశారు.. ఈ సినిమాకు గాను ఆయనకు జాతీయ అవార్డు లభించింది.