దాతృత్వం చాటుకున్న చిరంజీవి..అభిమాని కూతురు పెళ్ళికి రూ.లక్ష సాయం

95

మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్‌కి ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత.

వీళ్ళ పేదరికాన్ని చిరంజీవి స్వయంగా తెలుసుకొని వాళ్ళ పెద్దమ్మాయి వర్ష పెళ్ళికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేశారు. కాగా ఆమె పెళ్లి ఈ నెల 19 తేదీన జరగనుంది. నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ.. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని చిరూ చేశారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిది అని కన్నీటి పర్యంతమయ్యారు.

దాతృత్వం చాటుకున్న చిరంజీవి..అభిమాని కూతురు పెళ్ళికి రూ.లక్ష సాయం