పవన్ వెంట చిరంజీవి.. జనసేనలోకి చిరు

129

ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా జిల్లాల పర్యటన చేస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ జనసేన బీజేపీ అలయన్స్ గా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ నేపథ్యంలోనే బడా నేతలను కలుస్తున్నారు ఇరు పార్టీల పెద్దలు. ఇదిలా ఉంటే జనసేనకు సంబందించిన ఆసక్తి కర విషయాలు బయటకు వచ్చాయి. చిరంజీవి, పవన్ కు మద్దతు ప్రకటించినట్లుగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో మనోహర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. పవన్ వెంట తాను నడుస్తానని చిరంజీవి చెప్పినట్లుగా పార్టీ కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ వివరించారు. త్వరలో చిరంజీవి తిరిగి రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆయన జనసేనలోనే చేరుతారని నాదెండ్ల తెలిపారు.

పవన్ వెంట చిరంజీవి.. జనసేనలోకి చిరు