ఆహ్వానం ఇస్తున్నా కానీ పెళ్లికి రావొద్దు.. చింతమనేని ట్విస్ట్

77

పెళ్లంటే ఆ సందడే వేరు, పందిళ్లు, మేళతాళాలు, బంధువుల ముచ్చట్లు, ఆట పాటలు, ఇలా జీవితాంతం గుర్తిండిపోయే మధురానుభూతులు ఎన్నో ఉంటాయి. కానీ కరోనా కారణంగా పెళ్లి కూడా చిన్నపాటి ఫంక్షన్స్ లా చెయ్యాల్సి వస్తుంది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరైనా పెళ్ళికి పిలవాలి అంటే సంకోచిస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు వివాహం జరిగింది. పరిస్థితి అనుకూలంగా ఉంటే ఈ పెళ్ళికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రావాలి కానీ కరోనా ఉండటంతో కుటుంబ సభ్యులు కొద్దిమంది అతిధుల మధ్య పెళ్ళితంతు ముగించారు.

ఇక జనవరి 2 న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెద్ద కూతురు సాయి నవ్య వివాహం జరగనుంది. ఈ వివాహానికి చాలామందికి ఆహ్వానించాలని అనుకున్నారు చింతమనేని, కానీ కరోనా ఉండటంతో తమ కూతురు పెళ్ళికి రావద్దని ఆహ్వానపత్రికతో పాటు ఒక స్వీట్ బాక్స్ పంపారు. చింతమనేని ఇన్వెటేషన్ విచిత్రంగా ఉండటంతో ఆహ్వానం అందినవారు నవ్వుకుంటున్నారు. అయితే కరోనా సమయంలో అందరిని పిలిచి హాట్టహాసంగా పెళ్ళిచేస్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని ముందుగానే గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నియోజకవర్గ ప్రజలకు పంచేందుకు చింతమనేని లక్ష స్వీట్ బాక్సులను సిద్ధం చేశారు. స్వీట్ బాక్స్ తోపాటు ఆహ్వాన పత్రిక ఇచ్చి పెళ్ళికి రావద్దని చెబుతున్నారు.

నవదంపతులకి వారి వారి ఇళ్లనుంచే ఆశీర్వాదాలు అందించాలని కోరారు చింతమనేని. ఆహ్వాన పత్రికలో రావద్దని పేర్కొన్నందుకు ఎవరు తప్పుగా అర్ధం చేసుకోవద్దని తెలిపారు. మీ మేలు కోరే తాను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన అభిమానులు ఎవరు బాధపడొద్దని, కరోనా తగ్గిన తర్వాత మంచి వేడుక చేద్దామని హింట్ ఇచ్చారు చింతమనేని.

ఆహ్వానం ఇస్తున్నా కానీ పెళ్లికి రావొద్దు.. చింతమనేని ట్విస్ట్