చైనా మరో ఎత్తుగడ.. ఈ సారి మయన్మార్ టార్గెట్.. 2000 కిమీ గోడ

363

చైనా విస్తరణ వాదం చిన్నదేశాల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్ వంటి ప్రాంతాలను తన కోరలతో పట్టిపీడిస్తున్న డ్రాగన్, ఇప్పుడు మయన్మార్, నేపాల్ వంటి దేశాలను తన కోరల్లో బంధించేందుకు సిద్ధమైంది. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు, చిన్న చిన్న దేశాలు చైనాకు కిరవైతున్నాయి. విస్తరణ వాద సిద్ధాంతంలో ముందుకెళ్తున్న ఈ కమ్యూనిస్ట్ దేశం తమ చుట్టూ ఉన్న చిన్నదేశాలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది.

భయపెడుతుంది, బెదిరిస్తోంది.. మూసుకొని కూర్చోమని హెచ్చరిస్తుంది. 1960 నుంచి ఇదే తంతు. చైనా విస్తరణ వాదానికి భారత్ కూడా కొంత భూభాగాన్ని కోల్పోయింది అంటే వారికీ కబ్జా కాంక్ష ఎలా ఉందొ చెప్పొచ్చు. దూర్త దేశం పాకిస్థాన్ తో కలిసి భారత్ ను దెబ్బకొట్టాలని చైనా ఎత్తులు వేస్తుంది. పసికూనలైన మయన్మార్, నేపాల్ దేశాలను టార్గెట్ చేస్తూ సరిహద్దులను కదిలిస్తుంది.. సరిహద్దుల్లో రోడ్లు నిర్మిస్తుంది. ఇక తాజాగా మయన్మార్ సరిహద్దులో భారీ ఫెన్సింగ్ గోడను నిర్మిస్తుంది.

ఈ గోడ సుమారు 2000 కిలోమీటర్లు పొడవు ఉండనుంది. దీనిని ఇప్పటికే 440 మైళ్ళు నిర్మించినట్లు తెలుస్తుంది. ఆక్రమించినా అడిగేవారు లేరు అనే ధోరణి చైనాది. ఎదురుతిరిగితే సైన్యంతో దాడులు చేయించే ఈ దుష్ట దేశం ప్రపంచానికి క్యాన్సర్ అని సంబోదించడంలో తప్పు లేదు. దీనికి వైద్యం జరగాలి అంటే ప్రపంచదేశాలన్ని కలిసి ట్రీట్మెంట్ చెయ్యక తప్పదు. ఒక వేళ కమ్యూనిస్ట్ చైనా విస్తరణ వాదం ఇలానే కొనసాగితే భారత్ కు కూడా పెను ప్రమాదంలా మారే అవకాశం లేకపోలేదు.

చైనాను కట్టడి చెయ్యడం ఎలా

చైనాను కట్టడి చెయ్యగల శక్తి ప్రపంచంలోని కొన్ని దేశాలకే ఉందనేది జగమెరిగిన సత్యం.. అందులో భారత్ ఒకటి. ఇక ఇప్పటికే భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది. చైనా దురాక్రమణలను అడ్డుకుంటూ భారత్ దీటుగా జవాబు ఇస్తుంది. మంచు కొండల్లో చైనా సైనికులకు చుక్కలు చూపిస్తుంది. ఇక 15 రోజులు యుద్ధం చెయ్యడానికి సరిపడా ఆయుధాలను భారత్ సిద్ధం చేసి పెట్టుకుంది.

ఒక వేళ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు దిగితే యుద్ధం చెయ్యడానికి భారత సైన్యం ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడదని ఆర్మీ చీఫ్ తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకునే శక్తి సామర్ధ్యం భారత్ కె ఉన్నట్లు స్పష్టమవుతుంది. స్వదేశీ ఆయుధాలతో శత్రువును చిత్తుచేయగలమని బిపిన్ రావత్ చెబుతున్నారు. యుద్ధ ట్యాంక్ లు. స్వదేశీ మిసైల్స్ తో భారత్ ఏ దేశంతో అయిన పోరాడి గెలుస్తుందని ఘంటాపదంగా చెబుతున్నారు.

చిన్న దేశాలకు అండగా, టిబెట్, హాంకాంగ్ దేశాల విముక్తికి భారత్ నడుం బిగిస్తే చైనా చిత్తవుతుందని భారత్ మిత్రదేశాలు కూడా చెబుతున్న మాట. యుద్ధం వస్తే చైనాలో తిరుగుబాటు మొదలవుతుందని, ఆ తిరుగుబాటును అడ్డుకోవడం చైనా బలగాలకు సాధ్యం కాదని చెబుతున్నారు. చైనాలో వచ్చే తిరుగుబాటు అనే రచ్చ గెలిస్తే సరిహద్దుల్లో భారత్ ను నిలవరించగలదని, రచ్చను కట్టడి చెయ్యలేక చేతులు ఎత్తేస్తే మాత్రం చైనా విచ్చినం కావడం ఖాయమని అంతర్జాతీయ అంశాలపై అనుభవం ఉన్న వారు చేస్తున్న వ్యాఖ్యలు.

 

చైనా మరో ఎత్తుగడ.. ఈ సారి మయన్మార్ టార్గెట్.. 2000 కిమీ గోడ