Galwan Clash: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా

640

గతేడాది జూన్ 15 న భారత్‌- చైనా సరిహద్దు గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులకు మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే.. ఈ ఘర్షణలో భారత్ వైపు 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలోనే మృతి చెందారు. కానీ ఆ దేశం ఈ విషయంపై స్పందించేందుకు సుముఖత వ్యక్తం చెయ్యలేదు. ప్రపంచ దేశాలు చైనా వైపు మృతి చెందిన జవాన్ల సంఖ్యను చెప్పడంతో డ్రాగన్ దేశంలో చలనం వచ్చింది. దింతో శుక్రవారం మృతుల సంఖ్య వారి వివరాలు తెలిపారు. ఈ ఘర్షణలో చైనా వైపు నలుగురు సైనికులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. వీరికి సైనిక గౌరవ హోదాలు కల్పించినట్లు చైనా పేర్కొంది.

చైనా లెక్కలను అమెరికా, రష్యా దేశాలు కొట్టిపడేస్తున్నాయి. చైనా చెప్పిన లెక్కలు అవాస్తవమని చెబుతన్నారు. 40 మందికిపైనే మృతి చెందారని, వారికీ సైనిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు నిర్వహించలేదని రష్యా అంటుంది. అమెరికా కూడా ఇదే చెబుతుంది. అయితే నలుగురు చనిపోయారు అనడం చైనా అల్లిన కట్టు కథ అని భారత్ కూడా భావిస్తుంది. ఘటక్ సైనికుల వీరోచిత పోరాటంలో 40 మందికి పైగా చైనా సైనికులు ప్రాణాలు వదిలారని భారత్ చెబుతుంది.

Galwan Clash: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా