తెలంగాణ విద్యుత్ వ్యవస్థలపై పడ్డ చైనా హ్యాకర్లు

101

చైనా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. భారత్ కు చెందిన పలు కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలను టార్గెట్ చేస్తూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. పవర్ గ్రిడ్లను టార్గెట్ చేస్తూ చైనా హ్యాకర్లు సమస్యలు సృష్టిస్తున్నారు. గతేడాది ముంబై పవర్ గ్రిడ్ ఘటనకు చైనా హ్యకర్లే కారణమని తెలుస్తుంది. ఈ వార్త మరువనేలేదు మరోవార్త వచ్చి పడింది. ఇండియాలోని వ్యాక్సిన్లకు సంబంధించిన సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సర్వర్లను కూడా చైనా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రయత్నం చేశారన్నది మరో పిడుగులాంటి వార్త.

దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి చెప్పడంతో హ్యాకర్ల బారినుంచి తప్పించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని విద్యుత్ వ్యవస్థలపైనా చైనా హ్యాకర్లు దాడికి ప్రయత్నించారని తెలుస్తుంది. ఇలాంటి వార్తలు వరుసగా వింటుంటే.. అసలేం జరగబోతోందన్న ఆందోళన కనిపిస్తోంది. అందులోనూ.. అవును నిజమే.. హ్యాకర్లు పవర్ గ్రిడ్‌ను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నం నిజమే అని ఏకంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.

తెలంగాణ విద్యుత్ వ్యవస్థలపై పడ్డ చైనా హ్యాకర్లు