ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ తో రెస్టారెంట్

1784

చికెన్, దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఇక డిమాండ్ కి తగినట్లు ఉత్పత్తి కూడా ఉంది. ప్రస్తుతం కోడి పెంపకం 45 రోజుల్లో పూర్తవుతుంది. గతంలో లేయర్, ఫారం కోళ్లు లేకపోవడంతో నాటు కోళ్లపైనే ఆధారపడేవారు. లేయర్, కోళ్లు అందుబాటులోకి రావడంతో కొద్దిగా నాటుకోళ్ల గిరాకీ తగ్గింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం అధికంగా ఉండేది.

ఇది అల్పాదాయ వర్గాలకు చిన్నపాటి పరిశ్రమ వంటిది. అయితే రాను రాను ఈ చిన్నపాటి పరిశ్రమలు అంతరించి పోతున్నాయి. చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. అవికూడా ఫారాల్లోకి వచ్చి చేరాయి. ఇక ఫారం కోళ్లే ఇప్పుడు మార్కెట్ ను శాశిస్తున్నాయి.

కాగా ఇప్పుడు మరో కొత్త చికెన్ మార్కెట్లోకి వచ్చింది. ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ప్రస్తుతం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది మనదేశంలో కాదు కానీ మనకు ససంబందాలు ఉన్న సింగపూర్ లో.. ఇక ల్యాబ్ లో చికెన్ తయారైందో లేదో అప్పుడే రెస్టారెంట్ పెట్టేశారు. ల్యాబ్ లో తయారైన చికెన్ ప్రపంచంలోనే తొలిసారిగా సింగపూర్‌లోని ఈట్ జస్ట్ రెస్టారెంట్లో లభ్యంకానుంది. నవంబర్ 26న.. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఈ కల్చర్డ్ మీట్‌.. చికెన్ బైట్స్‌కు ఆమోదం తెలిపింది.

చికెన్ సెల్స్‌తో.. తయారుచేసిన మాంసాన్ని ఈట్ జస్ట్ రెస్టారెంట్లో కస్టమర్లకు అందించనున్నారు. ఇది సాధారణ చికెన్ కంటే కొద్దిగా రేటు అధికంగానే ఉంటుంది. ఇక ఈ చికెన్ తినేందుకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. కారణం అందులో ఎటువంటి పదార్దాలు వాడారో ప్రజలకు అవగాహన లేకపోవడమే అని తెలుస్తుంది. ఇక నార్మల్ చికెన్ కంటే తక్కువ రేటుకు వస్తే ప్రజలు ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తుంది.

ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ తో రెస్టారెంట్