‘RRR’లో ఛోటా భీమ్ ఈ బుడతడే.. ఫోటో వైరల్!

303

RRR గురించి ఏ చిన్న వార్త దొరికినా అది సెన్సేషనలే. ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్టే క్రేజీ కనుక. అలాంటిది ఒక్కో ఒక్కో రేంజ్ లో యూనిట్ రివీల్ చేస్తుంటే అభిమానులకు పండగగా మారుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే.. ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో ప్ర‌ధాన భాగం షూటింగ్ జ‌రుపుకుంటోండగా చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ కూడా ఒక చిన్న‌ప్ప‌టి పాత్ర‌ చేస్తున్నాడు. ధృవ‌న్ ఫేస్‌బుక్ పేజీలో అత‌ని లుక్ ఒక‌టి పోస్ట్ చేసి.. అత‌డు ఆర్ఆర్ఆర్ లో భాగం అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు.

దీంతో ఈ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ధృవన్ చిన్ననాటి హీరో పాత్రం పోషిస్తున్నాడన్నది అర్ధమైంది కానీ అది భీమ్ గానా.. అల్లూరి గానా అన్నది ఎవరూ చెప్పలేదు. ఎక్కడా లేదు. అయితే.. ఫోటో చూసిన వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితం భీమ్ పాత్రనే అంటున్నారు. ఇప్పటికే నెట్టింట్లో ఈ బుడతడే ఛోటా భీమ్ అంటూ కామెంట్లు హోరెత్తుతున్నాయి. చూడబోతే ఈ సినిమా అయ్యేలోపు ఈ బుడతడు నిజంగానే సూపర్ స్టార్ అయ్యేలా ఉన్నాడు.