చెన్నమనేని కేసు జనవరి 20కి వాయిదా

65

గత కొద్దీ రోజులుగా వేములవాడలో ఉప ఎన్నికలు వస్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉందని, అతడు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అర్హుడు కాదని అందేల శ్రీనివాస్ అనే వక్తి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ రమేష్ ఎన్నిక చెల్లదని తేల్చేసింది. దానిని సవాల్ చేస్తూ రమేష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు. అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టలేకపోతే.ఎందుకు మీ హోదాలు అని హైకోర్టు కేంద్ర హోంశాఖను ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 20కి హైకోర్టు వాయిదా వేసింది.

చెన్నమనేని కేసు జనవరి 20కి వాయిదా