పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఇకపై సోషల్ మీడియా ఖాతాల చెకింగ్!

74

నేటి కాలంలో పాస్‌పోర్టు కామన్ అయిపొయింది. ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ భాగం ఉద్యోగంలో నియమించుకునే సమయంలోనే పాస్‌పోర్టు అడుగుతున్నారు. పైగా గుర్తింపు కోసం పాస్‌పోర్టును మించినది లేదు. సో అందుకే నేటి యువత చదువుకొనే సమయంలోనే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటివరకు పాస్‌పోర్టు కావాలని పోలీస్ విచారణ తప్పనిసరిగా ఉండేది. వ్యక్తి గత నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం చూసి పాస్‌పోర్టు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పోలీస్ విచారణతో పాటు ఆ వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను కూడా చెక్ చేయనున్నారు.

అయితే.. ఇది మన దేశం మొత్తం కాదు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో మాత్రమే ఈ పద్ధతి అవలంభించనున్నారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా చెక్ చేయాలని ఉత్తరాఖండ్ పోలీసులు నిర్ణయించారు. ఇక నుంచి ఎవరైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే ఎంక్వైరీలో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను కూడా తనిఖీ చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ పద్దతి ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తగ్గించొచ్చని ఆయన అన్నారు.

సాధారణంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి పాస్‌పోర్ట్ ఇవ్వకూడదని పాస్‌పోర్ట్ చట్టంలో ఉంది. ఆ నిబంధనలో భాగంగా సోషల్ మీడియా ఖాతాలను కూడా చెక్ చేయాలనీ అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘సోషల్ మీడియాలో కొంతమంది పెట్టె పోస్టుల వల్ల అలర్లు, గొడవలు జరుగుతున్నాయని.. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కూడా సోషల్ మీడియా ఒక కారణంగా చెప్పొచ్చని తెలిపారు. అందుకే ఇక నుంచి సోషల్ మీడియా ఖాతాలను కూడా చెక్ చేయాలని నిర్ణయించామని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఇకపై సోషల్ మీడియా ఖాతాల చెకింగ్!