జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు..

68

అమరావతి ఉద్యమం 365 రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఐదుకోట్ల ఆంధ్రుల కల అమరావతిని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో అమరావతిని అల్లకల్లోలం చేసిందని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతొ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని రెఫరెండంగా పెట్టి జగన్ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మహిళపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు..