అభిమాని కోరిక తీర్చిన చంద్రబాబు..

88

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఓ సామాన్య కార్యకర్త కోరిక తీర్చాడు. తన పెళ్లిలో జూమ్ కాల్ ద్వారా హాజరై నూతన వాడెవరులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండల కేంద్రానికి చెందిన టీడీపీ దళిత నేత అశోకం కుమారుడు ఆల్బర్ట్, టీడీపీ అంటే అభిమానం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును తన పెళ్ళికి పిలవాలని అనుకున్నాడు. కానీ మనసులో సందేహం, తనలాంటి సాధారణ కార్యకర్త పెళ్ళికి చంద్రబాబు హాజరవుతారో లేదో అని మదిలో ప్రశ్న..

ఇక ఈ నేపథ్యంలోనే తన మనసులోని మాటను నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్‌కు చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని పార్టీ నేతలు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. భాను విజ్ఞప్తి మేరకు వివాహ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు జూమ్ వీడియో కాల్ ద్వారా పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశీర్వాదం అందుకున్న దంపతులకు, ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

అభిమాని కోరిక తీర్చిన చంద్రబాబు..