చలసాని శ్రీనివాస్ కూతురు ఆత్మహత్య

282

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చీబౌలిలోని ఐకియా స్టోర్ కు దగ్గరలోని ఫ్లాట్ 906 డీ లో భర్తతో కలిసి నివాసం ఉంటారన్నారు శిరిష్మ. అయితే బుధవారం రాత్రి ఆమె ఇంట్లోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సాయంత్రం భర్త ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. భార్య కనిపించకపోవడంతో ఆమె గదిలోకి వెళ్లి చూశాడు. ఆమె సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించడంతో కిందకు దింపి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐతే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

కాగా శిరిష్మకు గ్రానైట్ వ్యాపారి సిద్దార్ద్ తో 2016లో వివాహం జరిగింది. సిద్ధార్థ్ గ్రానైట్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటగా, శిరిష్మ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అయితే వీరికి పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్న సంతానం లేదు. ఇందుకోసం అనేక ఆసుపత్రులు తిరగరాని. చాలామంది డాక్టర్లను కలిశారని తెలుస్తుంది.

అయిన పిల్లలు కలగకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక కూతురు ఆత్మహత్యపై చలసాని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చలసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

చలసాని శ్రీనివాస్ కూతురు ఆత్మహత్య