ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్రం చక చక అడుగులు

177

దేశంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న పలు సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మెందుకు సిద్ధమైంది. ఇక మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి లైన్ క్లియర్ చేసింది. ఇదే విషయంపై తాజాగా మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు పరిపాలన చెయ్యాలి, వ్యాపారం కాదని వివరించారు. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను అమ్మెందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చక చక అడుగులు వేస్తుంది.

నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరించాలని కేంద్రం విధానాన్ని ఖరారు చేసినా కరోనా వల్ల ఆచరణ సాధ్యం కాలేదు. మహారాజాగా పేరొందిన ఎయిరిండియాతోపాటు లాభాల్లో ఉన్న కేంద్ర చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయంచింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఎయిరిండియా, బీపీసీఎల్‌తోపాటు కాంకర్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గగ్గోలు గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు.. ప్రతిపక్షాల విమర్శలు ఎదురుకుంటూనే వడివడిగా అడుగులు వేస్తుంది.

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్రం చక చక అడుగులు