Central Government : ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్.

246

సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. రైతుల ఆందోళనలకు సంబందించిన హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు, అకౌంట్ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది. కొద్దీ రోజుల క్రితమే ఈ ఆదేశాలు జారీచేసింది ఐటీ శాఖ, కానీ ట్విట్టర్ వీటిని పెడచెవిన పెట్టింది. దింతో కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక ఇచ్చింది. అయితే గతంలో ట్విట్టర్ పలు దేశాల ఆదేశాలను కూడా ఇదే విధంగా విస్మరించి మొట్టికాయలు తింది.. తమ చట్టాలకు లోబడి పనిచేయకపోవడంతో పలు దేశాలు ట్విట్టర్ కు యాడ్స్ నిలిపివేశాయి. ఇక భారత్ ఇచ్చిన హెచ్చరికలతో దారిలోకి వచ్చిన ట్విట్టర్ అభ్యంతరకర ట్విట్టర్లను, ఉద్వేగాలను రెచ్చగొట్టే వాటిని తొలగించింది.

#ModiPlanningFarmerGenocide అనే హ్యాష్‌ట్యాగ్‌తోపాటు అంత‌కుముందు తాను బ్లాక్ చేసిన‌ కొన్ని ఇత‌ర అకౌంట్ల‌ను ట్విట‌ర్ ఏక‌ప‌క్షంగా పున‌రుద్ధ‌రించింది. ట్విట్టర్ చర్యలను కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా కండించింది దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోకపోతే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. మార‌ణ‌హోమానికి ప్రేరేపించ‌డం అనేది భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ కాద‌ని, అది శాంతిభ‌ద్ర‌త‌లకు ముప్పు అవుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కాగా ఐటీ శాఖ ఆదేశాల త‌ర్వాత రైతుల ఆందోళ‌న‌ల‌కు సంబంధించిన‌ 100 అకౌంట్లు, 150 ట్వీట్ల‌ను ట్విట‌ర్ డిలీట్ చేసింది.

Central Government : ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..