ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలోకి 125 కంపెనీల కేంద్ర బలగాలు

170

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తృణమూల్ ను ఓడించేందుకు కేంద్ర పెద్దలు మొత్తం బెంగాల్ పర్యటన చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతోపాటు, హోంమంత్రి, ప్రధాని మోడీ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు సభల్లో పాల్గొన్నారు మోడీ. ఇక అమిత్ షా నెలలో నాలుగు సార్లు బెంగాల్ వెళ్తున్నారు. నడ్డా వారంలో ఒకరోజు బెంగాల్ లోనే ఉంటున్నారు. ఇటు ఒంటరి పోరు చేస్తున్న మమతా, సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. మూడోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మమతా..

ఇదిలా ఉంటే రాష్ట్రంలోకి పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను దింపుతున్నారు. రాష్ట్ర పోలీసులు మమతకు వత్తాసు పలుకుతున్నారని ఎన్నికల్లో కేంద్ర బలగాలను దించాలని బీజేపీ ఎన్నికల కమిషన్ కు లేక రాసింది. ఈ మేరకు స్పందించిన ఎన్నికల కమిషన్ కేంద్ర హోంశాఖతో చర్చించి కేంద్ర బలగాలను దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 25 వరకు 125 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ కు రానున్నాయి. బెంగాల్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల నాటికి కేంద్ర బలగాల సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది.

కేంద్ర బలగాలను దించడంపై మమతా సర్కార్ మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుకున్నారు. రాష్ట్ర పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తుంటే కేంద్ర బలగాలు దేనికని మమత సర్కార్ లోని పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకే కేంద్ర బలగాలను దింపుతున్నారని మండిపడుతున్నారు.

అయితే గత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు సజావుగా సాగాలి అంటే కేంద్ర బలగాలు ఉండటమే మంచిదని ఆలోచించిన ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ లేఖకు స్పందించి కేంద్ర బలగాల ఏర్పాటుకు ఒకే చెప్పింది. ఈ మేరకు 125 కంపెనీల బలగాలు ఫిబ్రవరి 25 వరకు బెంగాల్ చేరుకోనున్నాయి.

ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలోకి 125 కంపెనీల కేంద్ర బలగాలు