బెంగాల్ నుంచి ముగ్గురు ఐపీఎస్ లను వెనక్కు పిలిచిన కేంద్రం

118

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడి వేడిగా మారాయి. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాష్ట్రంలో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే.. ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రం డిప్యూటేషన్ పై వెనక్కు పిలిచింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సందర్బంగా ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది. నడ్డాకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారనే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నడ్డా భద్రతపట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై వెనక్కి రమ్మంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర హోంశాఖ చర్యలపై సీఎం మమత మండిపడుతుంది. కావాలనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ చూస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఆ పార్టీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ ఐపీఎస్ అధికారులను వెనక్కు తీసుకోవడంపై హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు అధికారికంగా లేఖ రాశారు. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సెంట్రల్‌ డిప్యుటేషన్‌పై విడుదల చేయాలంటూ సీఎస్‌కు పంపిన ఉత్తర్వుపై ఈ మేరకు స్పందించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ ఆరోపించారు.

 

బెంగాల్ నుంచి ముగ్గురు ఐపీఎస్ లను వెనక్కు పిలిచిన కేంద్రం