మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ సోదాలు

61

గుంటూరు, నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సిబిఐ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర క్యాడర్ కు చెందిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంలో సోదాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటివరకూ జరిగిన సోదాల్లో ఏమి స్వాధీనం చేసుకున్నారనే విషయంపై సిబిఐ అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.