ఆమంచికి సీబీఐ నోటీసులు.. కోర్టులను తిట్టినందుకే!

326

ఇప్పుడంటే ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులు బదిలీ అయి కొత్త వాళ్ళు వచ్చారు కానీ ఇంతకు ముందున్న జడ్జీలను టీడీపీ పార్టీ ప్రభావితం చేసిందని వైసీపీ నేతలు రోజూ మీడియాకి ఎక్కి వాదించేవారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పుబట్టిన ప్రతిసారి జడ్జీల మీద ఒకవిధమైన మాటల దాడే జరిగేది. అదంతా సైలెంట్ గా సోషల్ మీడియాలో జరిగిపోయేది. మరి ఇప్పుడు జడ్జీలు మారిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా అంటే అదీ లేదు. ఈ మధ్య పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ లో హైకోర్టు చివాట్లు పెట్టినంత పనిచేసింది. అది వేరే విషయం.

అయితే.. ఇంతకు ముందున్న న్యాయమూర్తులను సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలు… ఎమ్మెల్యేలు, ఎంపీల అధికారిక ఖాతాలు.. అభిమానుల ఖాతాలలో దారుణంగా పోస్టులు వచ్చేవి. కాగా.. ఇప్పుడు అలాంటి పోస్టులు పెట్టిన పాపానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా చీరాల నేత ఆమంచి కృష్ణమోహన్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పెడితే రాష్ట్రంలో పోలీసులు విధిస్తున్నారని పేరుంది. కానీ.. ఇప్పుడు కోర్టులపై కామెంట్స్ చేసినందుకు ఆ వైసీపీ నేతలకు ఏకంగా సిబిఐ నోటీసులు ఇస్తుంది.

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆమంచిపై అభియోగాలు ఉండగా న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ పోస్టులు పెట్టారని కేసులు నమోదయ్యాయి. ఆమంచితో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదవగా ఈ నెల 6వ తేదీని విశాఖలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సీబీఐ డీఎస్పీ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. మరి.. దీనిపై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!

ఆమంచికి సీబీఐ నోటీసులు.. కోర్టులను తిట్టినందుకే!