బ్రేకింగ్ న్యూస్.. సీబీఐలో 104 కిలోల బంగారం మిస్

137

సీబీఐ లాక్ అండ్ సీల్ కింద ఓ సంస్థకు చెందిన 104 కేజీల బంగారాన్ని నిల్వ చేసింది. అయితే ఆ బంగారం మిస్ అయినట్లుగా తెలుస్తుంది.. కాగా దీనిపై విచారణ చేపెట్టాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనిపై సీబీఐ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించింది. బంగారం మిస్సింగ్ విషయంపై రాష్ట్ర పోలీసులు విచారణ చేపడితే ప్రతిష్ట దిగజారిపోతుందని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐ అభ్యంతరాన్ని తిరస్కరించింది. రాష్ట్ర పోలీస్ శాఖా విచారణకు సీబీఐ సహకరించాలని తీర్పు వెలువరించింది. కాగా ఈ బంగారం విలువ 43 కోట్ల రూపాయాలు ఉంటుందని సమాచారం

 

బ్రేకింగ్ న్యూస్.. సీబీఐలో 104 కిలోల బంగారం మిస్