మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు

60

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై కేసు నమోదు అయింది. ఈ విషయాన్నీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. పట్టణంలో కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో సెక్షన్‌–30 అమల్లో ఉన్నాకూడా అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారిని దిగ్బంధం చేసే కార్యక్రమం చేశారని.. అందువల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో అఖిలప్రియతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై నాయకులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.