ఫ్లడ్ లైట్ల వెలుగులో పేకాట.

71

పేకాట అనేది చట్టవిరుద్ధమైన ఆట తెలుగు రాష్ట్రాల్లో పేకాటపై కఠిన నిబంధనలు ఉన్నాయి. పేకాట ఆడితే కేసులు పెట్టి జైలుకు పంపడం ఖాయం.. ఇన్ని కఠిన నిబంధనకు ఉన్న కాయి రాజా కాయి అంటున్నారు కొందరు వ్యక్తులు. గుంటూరు జిల్లా అచ్చంపేట, మాదిపాడులో జోరుగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పేకాటరాయుళ్లు ఈ స్థావరాలకు వచ్చి ఆట ఆడుతున్నారు. సత్తెమ్మతల్లి గుడికి వెళ్లే మార్గంలో ఉన్న తండాల్లో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసి ఆడుతున్నారు.

అయితే పోలీసుల కళ్లుగప్పి జరుగుతుందా లేదంటే పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతుందా అనే విషయం తెలియరాలేదు. సుమారు 50 మంది పేకాట రాయుళ్లు ఆట ఆడుతున్నట్లు తెలుస్తుంది. ఇక కొందరైతే అక్కడే వంటచేసుకొని తింటున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. చుట్టుపక్కల మద్యం సీసాలు భారీ సంఖ్యలో పడివున్నాయి. ఇక సీక్రెట్ గా వీరి ఆటను కవర్ చేసింది మీడియా. దింతో పేకాటరాయుళ్ల గుట్టు రట్టైంది. కాగా ఇక్కడ 24 గంటలు పేకాట ఆడుతున్నారు రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని మరి పేకాట ఆడుతున్నారు.

 

ఫ్లడ్ లైట్ల వెలుగులో పేకాట.