బ్రేకింగ్ న్యూస్ :- బస్సు ప్రమాదం 53 మంది మృతి

871

కామెరూన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామంవద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 53 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తుంది. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో తరలించారు. బస్సు ట్యాంకర్ ను డీ కొనడంతో అందులోని ఆయిల్ బస్సు పై పడింది. దింతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. బస్సు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడినవారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇక బస్సు డ్రైవర్ తప్పించుకున్నారని సమాచారం.

బ్రేకింగ్ న్యూస్ :- బస్సు ప్రమాదం 53 మంది మృతి