అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు సోనియాగాంధీ నుంచి పిలుపు

127

టీపీసీసీ పదవికోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం చేశారు. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఢిల్లీకి పిలిపించుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఈ సాయంత్రం ఆయన సోనియా గాంధీతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ కోసం ఆరుగురి మధ్య పోటీ నెలకొంది..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి , వి. హనుమంతరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువ అవకాశాలు రేవంత్ రెడ్డికే ఉన్నాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు.. అయితే బుధవారం హుటాహుటిన సంపత్ కుమార్ ఢిల్లీ వెళ్లడంతో కీలకంగా మారింది.. టీపీసీసీ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది.