ప్రయివేట్ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

59

హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళుతున్న ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన గురువారం ఉదయం అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిల రొంపిచర్ల శివారులోని తంగళ్లపల్లి వద్ద జరిగింది. వేగంగా వెళుతోన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టింది.. అయితే అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సును పరిశీలించారు.