ఘోర ప్రమాదం.. 38 మంది మృతి

232

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. దింతో 38 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బస్సు సిధి నుంచి సత్నా వెళ్తుండగా వంతెనపై నుంచి కాలువలో పడింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. చాలా దురదుష్టకర ఘటన అని అన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆఫీస్‌ ఓఎస్‌డీ సత్యేంద్ర ఖరే ఓ ప్రకటనలో చేశారు.

Bus Falls Into Canal 54 Passengers Onboard Madhya Pradesh - Sakshi

ఇక కాలువలోంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. కాలువలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని మృతదేహాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మృతదేహాల కోసం గాలింపు చెప్పట్టారు.

ఒక్కసారిగా పడిపోవడంతో తప్పించుకునేందుకు కూడా వీలు లేకుండా అయిపోయిందని చెబుతున్నారు స్థానికులు. బస్సు అద్దాలు కూడా క్లోజ్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయారని ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు తెలిపారు. అయితే బస్సులో ఏదైనా సమస్య తలెత్తిందా? లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడా? అనేది తెలియరాలేదు..

ఘోర ప్రమాదం.. 38 మంది మృతి