బస్సు బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు

74

ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా కోక్‌సర వద్ద అతివేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సు లో 50 మంది ఉన్నారు. కాగా ఈ బస్సు ధారమ్‌గఢ్‌ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. బస్సు బయలుదేరి 40 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మలుపును గమనించకుండా డ్రైవర్ అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా ఒడిశాలోని ధారమ్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌ 700 కిలో మీటర్లకు పైగా ఉంటుంది.

బస్సు బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు