ఢిల్లీలో బుగ్గన నిధుల వేట.. మంత్రులతో వరస భేటీ!

69

ఏపీలో ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు.. రావాల్సిన పెట్టుబడులు అనే టాపిక్ వినిపించి చాలా కాలమే అయింది. ఎన్నికలు.. కోర్టులు.. గొడవలు ఇలాంటి అంశమే తప్ప మిగతా అంశాలు పెద్దగా వినిపించలేదు. ఇప్పుడు ఆ వివాదం ఓ కొలిక్కి వచ్చేసింది. రాష్ట్రంలో ఎన్నికలకు హడావుడి మొదలైంది. ఇదిలా ఉండగానే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం మంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుగ్గన నిన్న, ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, అధికారులను కలుస్తున్నారు. ముందుగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్.కె.సింగ్‌ను కలిసిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి.. సాయంత్రం 5 గంటలకు ఆర్ఈసీ ఛైర్మన్ సంజయ్ మల్హోత్రాతో భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బేటీకి బుగ్గన సమయం కోరగా ఇంకా ఖరారు కాలేదు. ఇక శుక్రవారం కేంద్ర జలశక్తి, పౌర విమానయాన శాఖల కార్యదర్శులను కలవనున్నారు. ఆ తర్వాత విద్యుత్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్​తో కూడా మంత్రి భేటీ అవుతారు.