Budget update : బడ్జెట్ బాగుంది – రామకృష్ణ

135

నేడు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చదివి వినిపించారు. ఏఏ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామనే విషయాన్నీ ఆమె వివరించారు. ఇక ఇదిలా ఉంటే బడ్జెట్ పై ఏపీ సీఐఐ చైర్మన్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ తాము ఊహించిన దానికంటే బాగుందని అన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఎకానమీ గ్రోత్‌కు ఉపయోగపడేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేసారని తెలిపారు. లాజిస్టిక్ డెవలప్‌మెంట్‌పై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు. టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఈజీ ఆఫ్ డూయింగ్‌లో కూడా పెద్ద పీట వేశారు. ఇక టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Budget update : బడ్జెట్ బాగుంది – రామకృష్ణ