Budget sessions: రెండు రోజుల ముందే ముగియనున్న తొలి భాగం!

239

Budget sessions: తొలిభాగం పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశాలు ఈసారి రెండు రోజుల ముందుగానే ఫిబ్రవరి 13నే ముగియనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్​ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు రెండు రోజుల ముందే ముగిసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి 15న కాకుండా.. 13వ తేదీనే ముగియవచ్చని తెలుస్తోంది.

ముందే ముగించనున్న బడ్జెట్ సమావేశాల గురించి లోక్​సభ బిజినెస్​ అడ్వైజర్​ కమిటీలో చర్చకు వచ్చింది. పలు పార్టీలకు చెందిన నేతలు ఫిబ్రవరి 13 వరకే జరపాలని అభిప్రాయపడడంతో దానికే మొగ్గుచూపనున్నట్లుగా తెలుస్తుంది. కాగా.. తిరిగి మార్చి 8న సమావేశాలు ప్రారంభమవనుండగా.. వారాంతపు విరామాలు యధావిధిగా ఉండనున్నాయి. గత వర్షాకాల సమావేశాల్లో శని, ఆదివారాల్లోనూ పార్లమెంటు ఉభయ సభలు కొనసాగగా.. ఈసారి మాత్రం ఎప్పటిలా వారాంతపు విరామాలుండనున్నాయి. కాగా.. బడ్జెట్​ సమావేశాలు మొత్తంగా ఏప్రిల్​ 6న ముగియనున్నాయి.