Budget allocation for railways : రైల్వేకు భారీగా పెరిగిన బడ్జెట్ కేటాయింపు

159

2021 – 2022 కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో చదివి వినిపిస్తున్నారు. ఈ ఏడాది అనేక రంగాలకు బడ్జెట్ పెంచారు. వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి భారీగా ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ రూపొందించారు. ఇక రైల్వే బడ్జెట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2021- 22 బడ్జెట్ లో రూ. 1.10 లక్షల కోట్లను కేటాయించారు. 20323 నాటికీ దేశంలో అన్ని ప్రాంతాలకు రైల్వే విద్యుదీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా గతేడాది బడ్జెట్‌లో కేవలం రూ.70 వేల కోట్లు మాత్రమే రైల్వేలకు కేటాయించారు. ఈ ఏడాది దానిని మరో రూ.40 వేల కోట్లు పెంచి ఏకంగా రూ.1,10 వేల కోట్లు చేశారు. స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైళ్ల వేగం కూడా పెంచనున్నట్లు ప్రకటించారు.

Budget allocation for railways : రైల్వేకు భారీగా పెరిగిన బడ్జెట్ కేటాయింపు