ఐడిబిఐ వాటాల అమ్మకాన్ని కేంద్రం ప్రకటించే ఛాన్స్..

120

ప్రభుత్వ ఆర్ధికవ్యవస్థను మెరుగుపర్చడానికి ప్రైవేటీకరణను పుష్ చేసే చర్యల్లో భాగంగా రాబోయే యూనియన్ బడ్జెట్‌లో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ప్రభుత్వ-లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్‌లో 10 నుండి 15 శాతం వాటాను కేంద్రం విక్రయించే అవకాశం ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఇందులో భాగంగా 400 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్న ఎల్‌ఐసిని నియంత్రించే చట్టంలో ప్రభుత్వం మార్పులు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్‌తో చెప్పారని
పేర్కొంది.

ఇంతకుముందు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ వంటి పెద్ద కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణను మళ్లించాలన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రణాళికలు మహమ్మారి కారణంగా ముందుకు సాగలేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంకోచం తరువాత ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున ఆయా సంస్థల వాటాను విక్రయించే ప్రయత్నాన్ని ప్రభుత్వం తిరిగి మొదలుపెట్టిందని కూడా పేర్కొంది. అంతేకాదు ఐడిబిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ & సింధ్ బ్యాంక్ ల వాటాల అమ్మకాలను కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. కాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.