సంచలనం.. చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ @50,000

74

గురువారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. మొదటి సారి సెన్సెక్స్ 50,000 మార్క్ దాడి రికార్డు సృష్టించింది. కరోనా క్లిష్టపరిస్థితుల్లో పూర్తిగా డౌన్ అయిన మార్కెట్ లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో పుంజుకుంది. గురువారం ఉదయం 10:34 నిమిషాలకు సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 50,095వద్ద నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని ఉత్సాహం కనిపిస్తోంది.

గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జేకే టయర్స్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌, హవేల్స్‌ ఇండియా షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌,జీఎంఎం, ఆగ్రోటెక్‌ ఫూడ్స్‌, టాటా ఎలిక్సిలు భారీ నష్టాల్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడానికి జో బైడెన్ ప్రమాణస్వీకారమే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఉన్న సమయంలో తెచ్చిన ఆర్ధిక ఆంక్షలను బైడెన్ తీసేస్తాడనే ఆలోచనతో స్టాక్ మార్కెట్లు ఉపందుకున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

సంచలనం.. చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ @50,000