అయోమయంతో వార్తల్లో నిలిచిన బ్రిటన్‌ ప్రధాని

93

భారత్‌లో రైతుల ఆందోళన బ్రిటిష్‌ పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పందించిన తీరు అందర్నీ విస్తుపోయేలా చేసింది. ‘రెండు వారాలుగా ఢిల్లీ శివార్లలో రైతులు చలిలో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తూంటే వారిపై మోదీ ప్రభుత్వం బలప్రయోగానికి పాల్పడుతోంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ విషయమై జోక్యం చేసుకోవాలి.

ప్రతిష్ఠంభన త్వరగా వీడేట్లుగా సమస్యను పరిష్కరించాలని మోదీతో మీరు మాట్లాడతారా?’ అని జాన్సన్‌ను ఉద్దేశించి లేబర్‌ పార్టీకి చెందిన సిక్కు ఎంపీ తన్మన్‌జీత్‌ సింగ్‌ ధేసీ- హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో కోరారు. దీనిపై జాన్సన్‌- భారత్‌, పాకిస్థాన్‌ తమ మధ్య వివాదాల్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నది మా విధానం.. అంటూ సంబంధం లేని సమాధానం ఇచ్చారు. నివ్వెరపోయిన తన్మన్‌జీత్‌ ఆ తరువాత ట్విటర్‌లో తన ప్రశ్నను, జాన్సన్‌ సమాధానాన్ని పెట్టి ఆయన అవగాహన స్థాయి ఇదీ… అని హేళన చేశారు.